ఈసీల నియామకంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం 🏛️
- Shiva YT
- Mar 17, 2024
- 1 min read
Updated: Mar 18, 2024
కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఎన్నికల కమిషనర్‌ల నియామకాలను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాని నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాజీ ఐఏఎస్ అధికారులు ఇద్దరిని నూతన ఎన్నికల కమిషనర్‌లుగా నియమించింది. అయితే ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మినహాయించారని, సీజేఐ లేని కమిటీ చేపట్టిన ఈ నియామకాలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ⚖️











































