top of page

నేడు భారత్-పాక్ క్రికెట్ పోరు.. గెలిస్తే సెమీస్‌ టిక్కెట్ పక్కా. 🏏✨

యూఏఈలో అండర్-19 ఆసియా కప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఐసీసీ అకాడమీ ఓవల్‌-1 మైదానంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే, భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ మ్యాచ్‌లు ఏ టీవీ ఛానెల్‌లో ప్రసారం కావు. కాగా, ఈ మ్యాచ్‌లను ACC YouTube ఛానెల్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ TVలో ఉచితంగా ఆస్వాదించవచ్చు. 📺🏏

రెండు జట్లు.. భారత్: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, అరవెల్లి అవనీష్ రావు (వికెట్ కీపర్), ఇనేష్ మహాజన్, మురుగన్ అభిషేక్, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ. 🇮🇳🏏

పాకిస్థాన్: సాద్ బేగ్ (కెప్టెన్/వికెట్ కీపర్), అహ్మద్ హుస్సేన్, అలీ అస్ఫంద్, అమీర్ హసన్, అరాఫత్ మిన్హాస్ (వైస్ కెప్టెన్), అజాన్ అవైస్, ఖుబైబ్ ఖలీల్, నజబ్ ఖాన్, నవీద్ అహ్మద్ ఖాన్, మహ్మద్ రియాజుల్లా, మహ్మద్ తయ్యబ్ ఆరిఫ్, మహ్మద్ జిషాన్ షాజైబ్ ఖాన్, షామిల్ హుస్సేన్, ఉబైద్ షా. 🇵🇰🏏

 
 
bottom of page