🌐 దమ్మపేటలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ..🎤
- Shiva YT
- Nov 13, 2023
- 1 min read
ఇవాళ్టి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. 16 రోజుల పాటు ముఖ్యమంత్రి మొత్తంగా 54 సభలు నిర్వహించనున్నారు.

ఇవాళ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన చేయనుండగా.. దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేటలో సభలు నిర్వహిస్తారు. ఈ నెల 28 వరకు ఈ విడత ప్రచారం జరగనుండగా.. గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్ పర్యటన ముగుస్తుంది. 🚀











































