top of page

ప్రైవేట్‌ స్కూల్‌లో చెడ్డీ గ్యాంగ్‌ కలకలం రూ.8 లక్షల చోరీ!🏫 🚨

నగరంలో చెడ్డీగ్యాంగ్ చోరీలు మారోమారు కలకలం సృష్టించాయి. మియాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ స్కూల్‌లో చెడ్డీ గ్యాంగ్‌ శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు.

నగరంలో చెడ్డీగ్యాంగ్ చోరీలు మారోమారు కలకలం సృష్టించాయి. మియాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ స్కూల్‌లో చెడ్డీ గ్యాంగ్‌ శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. చెడ్డీలు ధరించి, ముఖాలకు ముసుగు ధరించి మారణాయుధాలతో వచ్చిన చెడ్డీ గ్యాంగ్ ముఠా స్కూల్ కార్యాలయంలోని కౌంటర్‌లో రూ.7.85 లక్షల నగదును దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఒంటి మీద దుస్తులు లేకుండా కేవలం చెడ్డీలతో వచ్చిన ఈ గ్యాంగ్‌ పాఠశాల కార్యాలయంలో సంచరించడం వీడియోలో చూడొచ్చు.పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీలను పోలీసులకు సమర్పించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది చెడ్డీ గ్యాంగ్ పనేనని, త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. కాగా గతంలోనూ ఒకట్రెండు చోట్ల చెడ్డీ గ్యాంగ్ చోరీలు నగరంలో చోటు చేసుకున్నాయి. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ సంచరించడం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.🏫 🚨


 
 
bottom of page