top of page

పసుపుతో అధిక బరువుకు చెక్..


ree

ఊబకాయం.. నేటి యువత ఎదుర్కొంటున్న ఓ భయంకరమైన సమస్య. ఊబకాయం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వంటి అనేక సమస్యలు దాడి చేస్తాయి. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోకపోతే సమస్యలు తప్పవు. బరువు తగ్గడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సమయానికి ఆహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి మీరు ఇప్పటికే పాటిస్తూ ఉండవచ్చు. కానీ ఆహారంలో పసుపు వినియోగించడం వల్ల బరువు తగ్గుతారని మీకు తెలుసా?

ree

పసుపు బరువు తగ్గడంలో సహాయపడుతుందని చాలామందికి తెలియకపోవచ్చు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. పసుపు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ree

పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గించడానికి, ఊబకాయం వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. కొన్నిసార్లు హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా బరువు పెరగడానికి కారణమవుతుంది. ఇలాంటి సందర్భాలలో కూడా పసుపు గొప్పగా పనిచేస్తుంది. PCOS ఉన్న వారిలో వేగంగా బరువు పెరగడం, కొవ్వును తొలగించడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ పసుపు తినడం వల్ల ఈ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

ree

మెటబాలిజం సరిగా లేకుంటే, బరువు తగ్గడం కష్టమే. కానీ ఆహారంలో పసుపు తింటే, మెటబాలిక్ సిండ్రోమ్‌తో పోరాడుతుంది. బరువును వేగంగా తగ్గిస్తుంది.

ree

ఏ వంటలలోనైనా పసుపు పొడిని జోడించవచ్చు. అలాగే ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి పసుపు తినవచ్చు. అల్లం, పసుపు రసం తీసి నిమ్మరసంలో కలిపి తాగవచ్చు.

 
 
bottom of page