top of page

🚨 అరెస్టైన చంద్రబాబు..ఐదు రోజులుగా జైల్లోనే.. లేటెస్ట్ అప్‌డేట్స్‌

💼 స్కిల్ డెవల‌ప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైన చంద్రబాబు.. ఐదు రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ స్థాయిలో చర్చించుకునేలా చేయాలనే ఉద్ధేశంతో ఢిల్లీ వెళ్లారు నారా లోకేష్.

ree

🔍 జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఢిల్లీ టూర్‌కు వెళ్లిన లోకేష్.. మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగుతోందన్న విషయాన్ని జాతీయస్థాయిలో హైలైట్‌ చేసే పనిలో పడ్డారు లోకేష్. పవన్ కల్యాణ్‌ జనసేన పార్టీతో కలిసి ముందుకు వెళ్లే అంశంపై త్వరలోనే పూర్తి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

📢 ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జనసేన, టీడీపీ నాయకులు కలిసి ఉమ్మడి పోరాటం చేస్తున్నారని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. 🔗🔒

 
 
bottom of page