top of page

📆🏛️ నేడు హైదరాబాద్‌కు అమిత్‌షా..

🗓️ సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇవాళ హైదరాబాద్‌‌కు రానున్నారు.

అయితే, అమిత్ షా షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది.

👁️‍🗨️ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. ఉదయం 11 గంటలా 10 నిమిషాల వరకు పరేడ్ గ్రౌండ్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవాలు, తర్వాత ఆయన ప్రసంగిస్తారు. వేడుకల అనంతరం 11 గంటలా 15 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి సీఆర్‌పీఎఫ్ సెక్టార్ మెస్‌కు చేరుకుంటారు.

🏟️ అయితే ఈ రెండు గంటల్లో బ్యాడ్మింటన్‌ పీవీ సింధుతోపాటు మరికొందరితో అమిత్‌షా భేటీ అవుతున్నట్లు సమాచారం. సీఆర్‌పీఎఫ్ మెస్‌ నుంచి ఒంటి గంటా 45 నిమిషాలకు షా శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరతారు. 2 గంటలా 25 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు అమిత్‌షా. 🇮🇳🛫

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page