top of page

🗓️ ఎన్నికల షెడ్యూల్‎కు ముందే ప్రజల్లోకి బీజేపీ..🗓️

🚂🕊️ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి యాత్ర ద్వారా తీసుకెళ్తున్నారు. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అక్షితల పంపిణీ జరిగింది. దేవాలయాల క్లీనింగ్ కార్యక్రమం జరుగుతుంది.

ree

ఈనెల 29 నుండి వచ్చే నెల 29 వరకు రామ మందిర దర్శనం కోసం ప్రత్యేక రైలు రైళ్ళను నడిపించనుంది కేంద్రం. 30 రోజులపాటు 30 ట్రైన్లు తెలంగాణ నుండి అయోధ్యకు వెళ్లనున్నాయి. ఒక్కో ట్రైన్‎లో 1400 మంది రామభక్తులు వెళ్లేందుకు అవకాశం ఉంది. వసతి, భోజనం, ప్రయాణ ఖర్చుల కోసం 1900 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. రామాలయ దర్శనం కోసం బీజేపీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

📈📝 ఇక పెద్ద ఎత్తున వాల్ రైటింగ్స్ చేపట్టాలని బీజేపీ డిసైడ్ అయింది. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటూ గోడలపై రాయాలని పార్టీ పిలుపునిచ్చింది. ప్రతి పార్లమెంటు పరిధిలో కనీసం1000 చోట్ల కమలం పువ్వు గుర్తులతో పాటు కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు రాయాలని పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమం తెలంగాణలో కూడా మొదలైంది వచ్చే నెల చివరి వరకు కొనసాగునుంది. సంస్థగత బలోపేతం కోసం పార్టీ గ్రామ ఛలో అభియాన్‎ను చేపట్టనుంది. వచ్చే నెలలో ఒకే రోజున అన్ని గ్రామాల్లో బీజేపీ బూత్ కమిటీలు లేనిచోట ఏర్పాటు చేయడం. ఉన్న చోట బలోపేతం చేయాలని డిసైడ్ అయింది. 🌐📈


 
 
bottom of page