top of page

🚩బీజేపీ నయా స్కెచ్‌..ఎన్డీయే సమావేశానికి పవన్‌..🙌

🗳️రాజకీయాల్లో శాశ్వత మిత్రులు..శాశ్వత శత్రువులంటూ ఉండరు. ఎప్పుడు ఏ పార్టీ, ఎవరితో కలిసి పనిచేస్తుందో చెప్పడం కష్టం. ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి.

ఇక బీజేపీ సారథ్యంలోని నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌ తన పాత, కొత్త మిత్రులను మంగళవారం ఢిల్లీలో జరిగే సమావేశానికి ఆహ్వానించింది. తెలుగురాష్ట్రాల్లో కేవలం జనసేన పార్టీకి మాత్రమే కబురు పంపారు. తెలుగుదేశం పార్టీకి మాత్రం ఆహ్వానం అందలేదు. 2024 ఎన్నికలే లక్ష్యంగా సమాయత్తమవుతున్న బీజేపీ.. ఎన్డీఏ సమావేశానికి మొత్తం 30 పార్టీలకు ఆహ్వానం పంపించింది. అయితే, ఎన్డీఏ కూటమిలోకి ఓబీసీ నేత రాజ్‌భర్ తిరిగొచ్చారు. ఓబీసీ, దళిత, గిరిజన-ఆదీవాసీల్లో పట్టున్న చిన్న పార్టీలతో బీజేపీ జట్టు కట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా.. పలు కీలక ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానం పంపింది. ఏపీ నుంచి జనసేన చీఫ్ పవన్ తోపాటు.. పలు కీలక పార్టీల నాయకులు హాజరుకానున్నారు. మంగళవారం జరిగే ఎన్డీయే సమావేశానికి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ మధ్యాహ్నం వెళ్తున్నారు. ఆయనతోపాటు పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ కూడా వెళ్తారని సమాచారం. వారాహి రెండో విడతయాత్రను రెండు రోజులు వాయిదా వేసి, మరీ హస్తినకు వెళ్తున్నారు పవన్‌. ఎన్డీయేలో కీలకంగా ఉన్న పార్టీలన్నీ ఈ సమావేశానికి హాజరవుతున్నాయి. పవన్‌ ఢిల్లీ పర్యటనతో బీజేపీ- జనసేన మధ్య బంధం మరింత బలపడే అవకాశం ఉందని. ఏపీలో పవన్‌ను ముందుంచి జనరల్‌ ఎలక్షన్స్‌కు వెళ్లాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 🧐

 
 
bottom of page