🚀 బిగ్ అప్డేట్..ఇక స్పిరిట్ వంతు.! డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.🌟
- Shiva YT
- Jan 21, 2024
- 1 min read
దర్శకుల్లో ఒక్కొక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. కొంతమంది దర్శకులు తమ ప్రాజెక్ట్‌లను తక్కువ సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే, మరికొందరు చాలా సమయం తీసుకుంటారు. తమ వర్క్‌పై పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే తమ సినిమాలను రిలీజ్ చేస్తారు.
రాజమౌళి లాంటి దర్శకులు బాహుబాలి సినిమా కోసమే కొన్నేళ్ల పాటు వర్క్ చేశారు. అలాంటి దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు. ఆయన తెరకెక్కించిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, లేటెస్ట్‌గా యానిమల్‌తో స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోడు సందీప్ రెడ్డి. ఇక యానిమల్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. అయితే దీని తర్వాత సందీప్ ప్రాజెక్టు ఏంటన్నది ఇంత వరకూ క్లారిటీ రాలేదు. సందీప్ వంగ చేతిలో యానిమల్’ మూవీకి సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ ఉంది.
అలాగే అల్లు అర్జున్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాడు వంగా. దీంతో పాటు పలువురు నిర్మాతలు ఆయన కాల్‌షీట్ కోసం ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటన్నిటి కంటే ముందే ప్రభాస్‌తో సినిమాను ప్రారంభించనున్నాడని బాలీవుడ్‌లో టాక్. బాలీవుడ్‌లో మాత్రమే కాదు.. రీసెంట్‌గా సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో ఇదే చెప్పారు. 🎬












































