top of page

📅 ఈ వారంలో 4 రోజులు అన్ని బ్యాంకులకు సెలవు..

🇮🇳 భారత్‎లో నిన్న మొన్నటి వరకు సంక్రాంతి సందర్భంగా అన్ని బ్యాంకులు మూతపడ్డాయి. దాదాపు మూడు రోజులు వరుస సెలవులు వచ్చాయి.

ree

అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి ఈ వారంలో తలెత్తనుంది. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. రిపబ్లిక్ డే, చివరి శనివారం, ఆదివారం సందర్భంగా మళ్ళీ మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉన్నందున ఉత్తర ప్రదేశ్ లోని బ్యాంకులన్నీ మూతపడనున్నాయి. ఉత్తరప్రదేశ్ లోనే కాకుండా ఇంఫాల్ లో కూడా 22న బ్యాంకులు మూసివేయనున్నారు. ఈ వారంలో ఏ పని జరగాలన్నా జనవరి 23, 24 తేదీల్లో ముగించుకోవాలి. జనవరి 25న మహ్మద్ హజ్రత్ అలీ జన్మదినం కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీంతో మణిపుర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‎లో బ్యాంకులను ఆప్షనల్ హాలిడే ప్రకటించారు. ఆ తరువాత జనవరి 26న రిపబ్లిక్ డే కారణంగా కూడా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. జనవరి 27 నెలలో చివరి శనివారం కావడంతో సెలవు ఉంది. ఇక జనవరి 28 ఆదివారం జనరల్ హాలిడే. దీంతో ఈ వారంలో కొన్ని రాష్ట్రాల్లో రెండు రోజులు, మరికొన్ని రాష్ట్రాల్లో మూడు రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. 🏦

 
 
bottom of page