బోనాలకు మందు లేదు భై..!
- Shiva YT
- Jul 14, 2023
- 1 min read
మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దకాణాలు మూసి ఉంటాయని సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ తరుణంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ డీఎస్ చౌహాన్ హెచ్చరించారు.

మద్యం ప్రియులకు రాచకొండ పోలీసులు మరోసారి షాకిచ్చారు. మొన్నటి మొన్న శ్రీ రామ నవమి వేడుకల సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేసిన అధికారులు.. మరోమారు షెట్టర్లు మూసేయాలని ఆదేశించారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 6వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు.ఏప్రిల్ 6వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీన ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దకాణాలు మూసి ఉంటాయని సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ తరుణంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ డీఎస్ చౌహాన్ హెచ్చరించారు.











































