top of page

భాగ్యనగరంలో సినిమాల జోరు.. నగరమంతటా షూటింగ్ల సందడి

బ్రో సినిమా రిలీజ్‌ సందడి మామూలుగా లేదు. వరుస అప్‌డేట్లతో ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు బ్రో మూవీ మేకర్స్. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో బ్రో ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరగనుంది.

రిలీజులు సందడి ఓ వైపు ఉన్నప్పటికీ, సెట్స్ మీదున్న సినిమాలు కూడా జనాలను ఊరిస్తూ ఉంటాయి. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలను లెక్కచేయకుండా కొంతమంది హీరోలు నాన్‌స్టాప్‌గా షూటింగులు చేస్తూనే ఉన్నారు. బ్రో సినిమా రిలీజ్‌ సందడి మామూలుగా లేదు. వరుస అప్‌డేట్లతో ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు బ్రో మూవీ మేకర్స్. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో బ్రో ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరగనుంది. అయితే, తన పని తనదే అన్నట్టు టైమ్‌ వేస్ట్ చేయకుండా ఓజీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. ఆయన హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఆర్ఎఫ్‌సీలో జరుగుతోంది.కూకట్‌పల్లి, పటాన్‌ చెరు వైపు కూడా స్టార్ట్ కెమెరా యాక్షన్‌ సౌండ్‌లు బాగానే వినిపిస్తున్నాయి. విజయ్‌ దేవరకొండ హీరోగా పరశురామ్‌ కెప్టెన్సీలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ కూకట్‌పల్లిలో జరుగుతోంది. వెంకటేష్‌ హీరోగా శైలేష్‌ కొలను డైరక్షన్‌లో జరుగుతున్న సైంధవ్‌ సినిమా షూటింగ్‌ పఠాన్‌ చెరులో జరుగుతోంది. మంచి హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న హీరో గోపీచంద్‌. ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్‌ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. వైష్ణవ్‌తేజ్‌ హీరోగా శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదికేశవ సినిమా షూటింగ్‌ సికింద్రాబాద్‌ వెస్ట్ మారేడ్‌పల్లిలో జరుగుతోంది.


 
 
bottom of page