నిమ్స్ మెడికల్ కాలేజ్‌లో కొత్త కోర్సుకు దరఖాస్తులు..
- Suresh D
- Jul 25, 2023
- 1 min read
నిమ్స్ మెడికల్ కాలేజ్‌లో మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్‌కి అప్లై చేసుకోవాలని కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.లక్షల్లో జీతం మంచి లైఫ్ లో సెట్ అవ్వలనుకునే విద్యార్థుల కలను నిమ్స్ మెడికల్ కాలేజ్ నిర్వహిస్తున్న మాస్టర్స్ ఇన్ హా స్పిటల్ మేనేజ్మెంట్ (ఎంహెచ్ఎం) కోర్సుతో సాధ్యం అవుతుంది అని అంటున్నారు నిమ్స్ వైద్యులు.

నిమ్స్ మెడికల్ కాలేజ్‌లో మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్‌కి అప్లై చేసుకోవాలని కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.లక్షల్లో జీతం మంచి లైఫ్ లో సెట్ అవ్వలనుకునే విద్యార్థుల కలను నిమ్స్ మెడికల్ కాలేజ్ నిర్వహిస్తున్న మాస్టర్స్ ఇన్ హా స్పిటల్ మేనేజ్మెంట్ (ఎంహెచ్ఎం) కోర్సుతో సాధ్యం అవుతుంది అని అంటున్నారు నిమ్స్ వైద్యులు.రెండున్నర సంవత్సరాల లో కాల పరిమితి ఉన్న ఈ కోర్స్ పూర్తి చేస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని నిమ్స్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగం,మెడికల్ విభాగం, కోర్సు అకడమిక్ ఇన్చార్జి డాక్టర్ లు అంటున్నారు. దేశంలోనే ఎంహెచ్ఎం కోర్సు అందిస్తున్న మెడికల్ కాలేజ్ ఒక్క నిమ్స్ మాత్రమేనని తెలిపారు. నిమ్స్ మెడికల్ కాలేజ్ లో ఎంహెచ్ఎం కోర్సు 19 ఏండ్లు పూర్తి చేసుకుంది.. ఈ 20వ సంవత్సరంలో 20 సీట్లకు దరఖాస్తులను ఆహ్వా నిస్తున్నామని చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 5 వరకు ఆన్లైన్ లో, 9వ తేదీ వరకు దరఖాస్తులను నేరుగా అందజేయాలని సూచించారు.నిమ్స్ మెడికల్ కాలేజ్ లో ఎంహెచ్ఎం కోర్సులో చేరలంటే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి.. 2023 డిసెంబర్ 31 వరకు 30 ఏళ్ళ లోపు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వారికి మూడేండ్ల సడలింపు ఉంటుందనీ..ఆయా అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి.అర్హులైన వారికి వందశాతం ఫీజురీయింబర్స్‌మెంట్ ఉంటుంది.అధికారులు అంటున్నారు.