“భగవంత్ కేసరి” బాలకృష్ణ హిందీ డబ్బింగ్‌కి నెటిజన్లు విస్తుపోతున్నారు🎞️🎥
- Suresh D
- Nov 25, 2023
- 1 min read
ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి రాగా హిందీ వెర్షన్ అయితే ఆడియెన్స్ కి ఒక సర్ప్రైజ్ అని చెప్పాలి.

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “భగవంత్ కేసరి” తో తన కెరీర్ లో తాను మంచి హిట్ అందుకోగా ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత అయితే ఫైనల్ గా ఓటిటిలో కూడా వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి రాగా హిందీ వెర్షన్ అయితే ఆడియెన్స్ కి ఒక సర్ప్రైజ్ అని చెప్పాలి. ఎందుకంటే హిందీ వెర్షన్ లో భగవంత్ కేసరి కి బాలయ్యే కంప్లీట్ డబ్బింగ్ చెప్పుకున్నారు.
ఇదొక ఎత్తు అయితే హిందీ వెర్షన్ లో బాలయ్య పలికించిన డైలాగ్స్ కి తన మాడ్యులేషన్ కి హిందీ వెర్షన్ లో చూసిన వారి నుంచి మంచి రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఇదే చెప్తున్నారు. దీనితో బాలయ్య నెక్స్ట్ నుంచి కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తారేమో అనేది చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.🎞️🎥