బిచ్చగాడు 3 ఉందంట..!నోరు విప్పిన హీరో విజయ్ ఆంటోనీ క్లారిటీ..
- Shiva YT
- May 25, 2023
- 1 min read
గతంలో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద్ ప్రభంజనం సృష్టించిన సినిమా బిచ్చగాడు. తమిళంతోపాటు తెలుగులోనూ పెద్ద హిట్ అయ్యింది. మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది.
గతంలో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద్ ప్రభంజనం సృష్టించిన సినిమా బిచ్చగాడు. తమిళంతోపాటు తెలుగులోనూ పెద్ద హిట్ అయ్యింది. మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్ ఆంటోని.. నటుడిగా మారి ‘నకిలీ’ ‘డాక్టర్ సలీమ్’ వంటి హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. బిచ్చగాడు తమిళ్ సినిమా అయినప్పటికీ తెలుగులో డబ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. తమిళ్‌లో వచ్చిన పిచ్చైకారన్ సినిమాను బిచ్చగాడు అనే టైటిల్‌తో తెలుగులో విడుదల చేశారు.ఇక అంత పెద్ద హిట్ అందుకున్న చిత్రానికి సీక్వెల్ తీసుకురాబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో మూవీపై ఇంట్రెస్టింగ్ పెరిగింది. ఇక రీసెంట్ గా బిచ్చగాడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.