top of page

గ్రామంలో యదేచ్చగా ఎలుగుబంట్ల సంచారం.. 🏡🌾📡

ఉద్దాన ప్రాంతంలోని రట్టి కొండలు, నల్ల బొడ్లూరు మెట్ట ప్రాంతం గతంలో ఎలుగుబంట్లుకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవి. ఈ ప్రాంతంలో ఉంటూ కొండజాతి ఫలాలు, సమీప జీడి, కొబ్బరి తోటలలో ఆహారం సేకరిస్తూ జీవనం కొనసాగించేవి ఎలుగు బoట్లు. 🌾🍌🥥

కానీ తరువాత కాలంలో రట్టి కొండలు, నల్ల బొడ్లూరు మెట్టను గ్రావెల్ కోసమని, ఇళ్ళ నిర్మాణాల కోసమని యధేచ్ఛగా మైనింగ్ చేయటంతో రట్టి కొండ, మెట్ట ప్రాంత స్వరూపమే పూర్తిగా మారిపోయింది. 🏞️⛏️🏚️

దానికి తోడు గతంలో వచ్చిన తిత్లీ తుఫాన్ దెబ్బకు సమీప ప్రాంతంలోని తోటలలో చెట్లు విరిగిపోయి వీటి ఆవాసం దెబ్బతింది. దీంతో ఎలుగు బoట్లు ఆహారం కోసం జనావాసాల బాట పడుతున్నాయి. 🌀🏠🍲

వీధుల్లో గ్రామస్తులు తిని పడేసే ఆహార వ్యర్ధాలే కాకుండా అప్పుడప్పుడు రాత్రిపూట అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలోని మిడ్ డే మిల్స్ కిచెన్ రూమ్ లలోకి సైతం కిటికీ ఊచలు విరిచి ఎలుగుబంట్లు చొరబడి ఆహార దినుసులను తినేస్తున్నారు. అప్పుడప్పుడు మనుషులపై దాడులకు దిగుతుండటంతో పాటు తమ ఉపాధి పైన తీవ్ర ప్రభావం చూపుతున్న ఎలుగు బంట్ల సంచారం నుండి రక్షణ కల్పించాలని అటవీశాఖ అధికారులను ఉద్దానో ప్రాంత ప్రజలు కోరుతున్నారు. 🚑🏫🍛

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page