బాలయ్య బ్యాగ్ లో ఆ బాటిల్ కచ్చితంగా ఉంటుంది 💫🍾
- MediaFx

- May 2, 2024
- 1 min read
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. తాను పోటీచేస్తున్న హిందూపురం నియోజకవర్గ బాధ్యతలు చూస్తూనే మరోవైపు రాయలసీమలో విస్త్రతంగా పార్టీతరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. బాలయ్యకు మద్యం అలవాటు ఉందనే విషయమై ఆయన చిన్న అల్లుడు భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మామయ్య తన బ్యాగ్ లో ఎప్పుడూ ఓ బాటిల్ ఉంచుకుంటాడని, ఎక్కడకు వెళ్లినా అది తనతోనే ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. బాలయ్య మ్యాన్షన్ హౌస్ తాగుతారనే విషయాన్ని ఆయన అభిమానులు ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. దాన్ని బాలయ్య బ్రాండ్ గా పిలుచుకుంటారు. శ్రీభరత్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పారు. మామయ్య మ్యాన్షన్ హౌస్ తాగుతాడని తెలిసిన తర్వాత ఆ కంపెనీ స్టాక్ విలువ పెరిగిందన్నారు. వేడినీళ్లల్లో కలుపుకొని తాగుతారంటకదా అని యాంకర్ అడగ్గా.. అవును అది నిజం అన్నారు భరత్. బాలయ్య దగ్గర ఎప్పుడూ ఓ బ్యాగ్ ఉంటుందని, అందులో మందు సీసాతోపాటు వేడినీళ్లు కూడా ఉంటాయని, ఎక్కడకు వెళ్లినా ఆ బ్యాగ్ ఉండాల్సిందే. అమెరికా వెళ్లినా దాన్ని వెంట తీసుకువెళతారని భరత్ చెప్పారు.




Comments