top of page

వెండి తెరపైకి సూపర్ స్టార్ జీవిత కథ..హీరో ఎవరో తెలుసా..?🎥💫


సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది  జీవితకథలు సినిమాలుగా వచ్చాయి. సినిమావాళ్ల జీవిత కథల పై కూడా సినిమాలు వచ్చాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ జీవిత కథపై కూడా సినిమా తెలుస్తోంది. సూపర్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జర్నీ గురించి ప్రతిఒక్కరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన పై సినిమా రానుంది. రజనీకాంత్ బెంగళూరులో పుట్టి పెరిగారు. బెంగుళూరులో బస్ కండక్టర్ గా కూడా చేశారు. ఆ తర్వాత రాత్రికి రాత్రే చెన్నై వెళ్లిపోయారు. అక్కడ హీరోగా ప్రయత్నించి.. సక్సెస్ అయ్యారు. రజనీకాంత్ తమిళ్ తో పాటు, తెలుగులోనూ, కన్నడ సినిమాల్లో కూడా నటించారు. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం. దీన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు.

సాజిద్ నడియాడ్‌వాలా బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, అలాగే భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించారు. రజనీకాంత్ బయోపిక్‌ కూడా నిర్మించనున్నారని తెలుస్తోంది. మన దేశంలోని ప్రధాన భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ బయోపిక్ ప్రారంభ దశలో ఉంది. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే ఆసక్తి నెలకొంది.

రజనీకాంత్ బయోపిక్ విషయానికి వస్తే, రజినీకాంత్ పాత్రలో ఎవరు నటిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇందులో రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటిస్తారని కూడా ప్రచారం సాగుతుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. రజనీకాంత్ బయోపిక్ చేయడం అంటే చాలా ప్రిపరేషన్ ఉండాలి. అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా సెట్స్ వేయాలి. 2025 నాటికి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.  



 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page