తుఫానులోనూ.. తుక్కు రేగ్గొడుతున్న బేబీ కలెక్షన్స్..💰🎬
- Suresh D
- Jul 28, 2023
- 1 min read
సమ్మర్‌లో బాక్సాఫీస్ నిండలేదన్న బెంగను తాజాగా తీర్చేస్తోంది బేబీ మూవీ..! ఎవ్వరూ ఊహించనట్టు.. ఎవ్వరూ అంచనావేయనట్టు ఈ మూవీ కలెక్షన్ల వరద పారిస్తోంది.

సమ్మర్‌లో బాక్సాఫీస్ నిండలేదన్న బెంగను తాజాగా తీర్చేస్తోంది బేబీ మూవీ..! ఎవ్వరూ ఊహించనట్టు.. ఎవ్వరూ అంచనావేయనట్టు ఈ మూవీ కలెక్షన్ల వరద పారిస్తోంది. తుఫానులోనూ.. ఎడతెరపి కొడుతున్న వానల్లోనూ.. రిలీజ్ డే నాటి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. కలెక్షన్స్‌లో ఎలాంటి డ్రాప్ లేకుండా.. కొనసాగుతోంది. ఇక ఆ క్రమంలోనే దాదాపు 12 రోజుల్లోనే వరల్డ్ వైడ్ 71.6 క్రోర్ గ్రాస్‌ను వచ్చేలా చేసుకుంది బేబీ మూవీ.ఎస్ ! సాయి రాజేష్ డైరెక్షన్లో.. రొమాంటిక్ డ్రామా జోనర్లో.. చిన్న మూవీగా తెరకెక్కిన ఈ మూవీ పెద్ద విక్టరీ కొట్టింది. అప్పటి వరకు హిట్టనేదే లేని ఆనంద్ దేవరకొండకు సూపర్ డూపర్ హిట్‌నిచ్చింది. షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే చేసుకునే వైష్ణవి చైతన్యను.. హీరోయిగా నిలబడేలా చేసింది. ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్న విరాజ్ అశ్విన్ కు మంచి సపోర్ట్ నిచ్చింది. దాంతో పాటే.. డైరెక్టర్ సాయి రాజేష్‌ను స్టార్ డైరెక్టర్గా మార్చేసింది. ప్రొడ్యూసర్ గా ఎస్ కెఎన్ ను ఇండస్ట్రీలో పాతుకుపోయేలా చేసింది.🎥🎞😎











































