top of page

బాబోయ్‌.. చిరుతను వేటాడిన కుక్కలు..!


అడవిలో భయంకర జంతువు సింహం, చిరుతలు వాటికి కనిపించిన ఏ చిన్న జీవిని కూడా విడిచిపెట్టకుండా చంపేస్తాయి. అందుకే వీటిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఇది రెప్పపాటులో తన ఎరపైకి దూసుకెళ్లి చంపేస్తుంది. కానీ, ఇక్కడ కుక్కల దాడిలో చిరుత ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్‌ వీడియోలో కుక్కల గుంపు చిరుతపులిని చుట్టుముట్టి దాడి చేసింది. చిరుతను రౌండప్ చేసిన గ్రామ సింహలు దాన్ని ఊపిరాడకుండా చేశాయి. ఇదంతా దూరంగా ఉన్న వ్యక్తులు ఎవరో వీడియో తీశారు. వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తులు సైతం ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు. వారంతా బిగ్గరగా అరవటం కనిపించింది. కానీ, నరమాంస భక్షకంగా మారిన కుక్కలు చిరుతను చిల్చీ చెండాడినట్టుగా చంపేశాయి. ఈ షాకింగ్ వీడియో నెటిజన్లు సైతం భయబ్రాంతులకు గురి చేసింది.



 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page