top of page

ఎంబాపే ఎక్స్‌ ఖాతా హ్యాక్‌..


ఫుట్‌బాల్‌ యువ సంచలనం, ఫ్రాన్స్‌కు చెందిన కిలియన్‌ ఎంబాపే ‘ఎక్స్‌’ ఖాతా హ్యాక్‌ అయింది. గురువారం అతడి ఖాతా నుంచి అనుచిత పోస్టులు కనబడటంతో ఎంబాపే అభిమానులతో పాటు ఫుట్‌బాల్‌ క్రీడాలోకం కలవరపాటుకు గురైంది. ఎంబాపే అకౌంట్‌ను హ్యాక్‌ చేసిన హ్యాకర్లు.. ఇజ్రాయెల్‌, క్రిప్టో కరెన్సీ, మాంచెస్టర్‌ సిటీ (ఫుట్‌బాల్‌ ఫ్రాంచైజీ), లియోనల్‌ మెస్సీపై అనుచిత కామెంట్స్‌ పెట్టారు. ‘ఫుట్‌బాల్‌లో ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ అంటే ఎప్పటికీ రొనాల్డోనే. ఈ వ్యక్తి నాకు ఆదర్శం కాదు’ అంటూ లియోనల్‌ మెస్సీ ఏడుస్తున్న ఫొటోను షేర్‌ చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అయింది. ప్రముఖ ఫుట్‌బాల్‌ ఫ్రాంచైజీ అయిన మాంచెస్టర్‌ సిటీని విమర్శిస్తూ పెట్టిన పోస్టులు వివాదాస్పదమయ్యాయి. ఈ పోస్టులను పోస్టు చేసిన కొద్దిసేపటికే హ్యాకర్లు వీటిని డిలీట్‌ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page