రేపు ఒంటిగంటకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం🗓️🏛️
- Suresh D
- Dec 6, 2023
- 1 min read
అనుముల రేవంతరెడ్డి అను నేను... అంటూ తెలంగాణ రెండో సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ కొత్త సీఎం ప్రమాణస్వీకారోత్సవ సభ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది.

అనుముల రేవంతరెడ్డి అను నేను... అంటూ తెలంగాణ రెండో సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ కొత్త సీఎం ప్రమాణస్వీకారోత్సవ సభ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఈ సభకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు అధికారులు. ఎల్బీ స్టేడియంలో శానిటేషన్ ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్. ఈ కార్యక్రమంలో ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రే, చీఫ్ వెటర్నరీ డాక్టర్ అబ్దుల్ వాకీల్, అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరిష్, యాదగిరిరావు, ఉపేందర్‌రెడ్డి, సీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ పద్మజ పాల్గొన్నారు.
గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు రేవంత్‌రెడ్డి. ముందుగా ఉదయం 10గంటలకు ప్రమాణస్వీకారం చేయాలని భావించారు. కానీ... ఆ సమయాన్ని మార్చి... మధ్యాహ్నం ఒంటిగంటకు మార్చారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత... కృతజ్ఞత సభను కూడా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి స్పీచ్ కూడా ఉంటుందని సమాచారం. ఈనెల 9న కృతజ్ఞత సభ పెట్టుకోవాలని భావించారు. కానీ ఈ నిర్ణయాన్ని మార్చుకుని రేపే (గురువారం) ప్రమాణస్వీకార సభ, కృతజ్ఞత సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
నిన్న (మంగళవారం) తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి పేరును... ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. వెంటనే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు రేవంత్‌రెడ్డి. నిన్న (మంగళవారం) రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తున్నారు. రేపటి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు ఆహ్వానిస్తున్నారు రేవంత్‌రెడ్డి. నిన్న రాత్రి డీకే శివకుమార్, మాణిక్కం ఠాగూర్‌తో భేటీ అయ్యారు. ఈ ఉదయం నుంచి కూడా ఏఐసీసీ పెద్దలను కలిసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. ఉదయం ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిశారు. తన ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానించారు. రేవంత్‌రెడ్డి వెంట షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి ఉన్నారు.🗓️🏛️