మాజీ సీఎం జగన్‌కు భారీ స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ
- MediaFx

- Jun 18, 2024
- 1 min read
Updated: Jun 19, 2024
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. సోమవారం 30 మంది సెక్యూరిటీ సిబ్బంది తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అధికారాన్ని కోల్పోవడం, ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ప్రభుత్వ భద్రత కుదిరే అవకాశం లేకపోవడంతో జగన్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.ఇకపై జగన్ మాజీ సీఎంగా, సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా ఆయన భద్రతలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే జగన్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, పాదయాత్ర సమయంలో ప్రైవేట్ భద్రతా సిబ్బందిని భారీ మొత్తంలో నియమించిన విషయం తెలిసిందే.











































