top of page

అపరిచితుడు మూవీ రీరిలీజ్ .. ఎప్పుడంటే?


కోలీవుడ్ స్టార్ యాక్టర్ విక్రమ్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం అపరిచితుడు. 2005 లో థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం మే 17, 2024 న థియేటర్ల లోకి మరోసారి రానుంది.సదా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్, వివేక్, నాజర్, కొచ్చిన్ హనీఫా, నేదురుమూడి వేణు కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ ఫిల్మ్స్ పతాకంపై వి.రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. పలు తమిళ చిత్రాలు తెలుగు లో కూడా రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. అపరిచితుడు చిత్రం రీ రిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page