top of page

ఆపద్బాంధవుడు అన్నయ్య.. చిరంజీవికి పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు


ree

నా దృష్టిలో అన్నయ్య చిరంజీవి ఆపద్బాంధవుడు.. అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఆయన ఎంతోమందికి సాయం చేయడం నాకు తెలుసు.. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కావాల్సిన వారి కోసం ఎంతవరకైనా తగ్గుతారు.. అభ్యర్థిస్తారు. జనసేనకు రూ.5 కోట్ల విరాళాన్ని అందజేసి.. ఆయన ఇచ్చిన నైతిక మద్దతు అఖండ విజయాన్ని అందించింది. గొప్పదాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతుడికి సదా కృతజ్ఞుడిని. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని ట్వీట్ చేస్తూ షేర్ చేసిన త్రోబ్యాక్ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. నేడు చిరుకు బర్త్ డే విషెస్‌ తెలియజేస్తూ విశ్వంభర నుంచి కొత్త పోస్టర్‌ షేర్ చేశారు మేకర్స్‌. అతీత శక్తులతో నిండిపోయిన త్రిశూలాన్ని చేతపట్టుకున్న చిరంజీవి లుక్‌ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.




 
 
bottom of page