పేదల ఆకలి తీర్చేందుకు మళ్లీ తెరుచుకోనున్న అన్న క్యాంటీన్లు
- MediaFx

- Jun 17, 2024
- 1 min read
చంద్రబాబు నాయుడు సర్కార్, పేదలు, రోజువారీ కూలీల ఆకలి తీర్చేందుకు, అన్నా క్యాంటీన్లను మళ్లీ తెరవనుంది. 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం రూ. 5కే భోజనం అందించిన ఈ క్యాంటీన్లు, వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూసివేశారు. ప్రస్తుతం తిరిగి తెరుచుకోనున్న ఈ క్యాంటీన్లు, పేదలకు మళ్లీ తక్కువ ధరకే భోజనం అందించనున్నాయి. ఈ క్యాంటీన్లు మూడు వారాల్లోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.










































