top of page

Anant Ambani Wedding: బాంబు బెదిరింపు పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు


ree

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ గ్రాండ్ వెడ్డింగ్ జరిగిన జియో వరల్డ్ సెంటర్‌లో బాంబు బెదరింపు పోస్ట్ చేసిన 32 ఏళ్ల ఇంజనీర్‌ను ముంబై పోలీసులు మంగళవారంనాడు అరెస్టు చేశారు. పోస్ట్‌పై వెంటనే అప్రమత్తమైన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు గజురాత్‌లో నిందితుని అతని నివాసంలో పట్టుకున్నారు. వడోదరకు చెందిన 'వైరల్ షా'‌గా అతనిని గుర్తించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ''అంబానీ పెళ్లిలో బాంబు పేలితే సగం ప్రపంచం తలకిందులు అవుతుందన్న సిగ్గులేని ఆలోచన నా మదిలో మెదిలింది. ఒక్క పిన్‌కోడ్‌లో ట్రిలయన్ డాలర్లు'' అని సోషల్ మీడియా పోస్ట్‌‌లో రాసి ఉంది తొలుత ఇది ఉత్తుత్తి బాంబు బెదిరింపేనని పోలీసు అధికారులు భావించినప్పటికీ బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని వెడ్డింగ్ ఈవెంట్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అనంతరం చేపట్టిన దర్యాప్తులో 'ఎక్స్' యూజర్‌ను వడోదరకు చెందిన వ్యక్తిగా భావించి నిందితుడుని పట్టుకున్నారు. అతన్ని ముంబైకి తీసుకువస్తున్నారు.

 
 
bottom of page