top of page

గాంధీనగర్‌లో అమిత్ షా ఘన విజయం

కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఘన విజయం సాధించారు. ఎన్డీఏ కూటమికి తొలి విజయాన్ని కట్టబెట్టారు. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీ చేసిన అమిత్ షా.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్ భాయి పటేల్ మీద 4.10 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అమిత్ షాకు మొత్తంగా 5.26 లక్షల ఓట్లు పోలవగా.. ఆయన ప్రత్యర్థి రమణ్ భాయి పటేల్‌కు 1.15 లక్షల ఓట్లు మాత్రమే దక్కాయి.


 
 
bottom of page