అమెరికా, రష్యాల మధ్య ఖైదీల మార్పిడి..
- MediaFx
- Aug 2, 2024
- 1 min read
అమెరికా, రష్యాల మధ్య నానాటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కీలక పరిణామం జరిగింది. ఇరు దేశాలు గురువారం మొత్తం 24మంది ఖైదీలను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత వాషింగ్టన్, మాస్కోల మధ్య ఖైదీలకు సంబంధించిన అతిపెద్ద ఒప్పందం ఇదే. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జనరల్ రిపోర్టర్ ఇవాన్ గెర్ష్‌కోవిచ్, కార్పొరేట్ సెక్యూరిటీ ఉద్యోగి పాల్ వేలన్, రష్యా విమర్శకులు కారా ముర్జాతో పాటు మరో 11 మంది రాజకీయ ఖైదీలను మాస్కో విడుదల చేసింది. దీనికి బదులుగా ఇద్దరు స్లీపర్ ఏంజెట్లు, అమెరికా అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు రష్యన్లు, మరికొందరిని మాస్కో విడుదల చేయించుకుంది.