top of page

ఉదయ్ కిరణ్‌తో సహా ఆ సినిమాలో నటించిన వీరంతా చనిపోయారని మీకు తెలుసా..?

పెద్ద హీరోగా ఎదుగుతాడు అనుకునే లోగా ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయి అభిమానులను శోక సంద్రంలో ముంచేశారు. ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా రాణిస్తారు అనుకున్న సమయంలోనే ఆయనకు ఆఫర్స్ తగ్గాయి. ఆ సమయంలోనే ఆయన పెళ్లి చేసుకున్నారు.

ree

ఉదయ్ కిరణ్. ఒకప్పుడు లవర్ బాయ్ తన ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ యంగ్ హీరో. పెద్ద హీరోగా ఎదుగుతాడు అనుకునే లోగా ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయి అభిమానులను శోక సంద్రంలో ముంచేశారు. ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా రాణిస్తారు అనుకున్న సమయంలోనే ఆయనకు ఆఫర్స్ తగ్గాయి. ఆ సమయంలోనే ఆయన పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్ళైన కొంతకాలానికే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఉదయ్ కిరణ్. అయితే ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన వారిలో చాలా మంది చనిపోయారన్న విషయం మీకు తెలుసా. ఒకే సినిమాలో ఉదయ్ కిరణ్ తో పాటు నటించిన ఈ స్టార్ యాక్టర్స్ అంతా మరణించారు.ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . 2001లో విడదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించగా ఈ సినిమాలో ఇతర పాత్రలో నటించిన నటీనటులు కొందరు మరణించారు.ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ తో పాటు ఈ సినిమాలో నటించిన ధర్మవరకు సుబ్రహ్మణ్యం, ఎమ్ ఎస్ నారాయణ, ఆహుతి ప్రసాద్, అలాగే వైజాగ్ ప్రసాద్ కూడా మరణించారు. ఇలా ఓకే సినిమాలో నటించిన వీరంతా ఇప్పుడు ఈ లోకంలో లేకపోవడం నిజంగా బాధాకరమే.


 
 
bottom of page