top of page

చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చిన సమంత..

కొద్ది రోజులుగా మీడియాకు దూరంగా ఉన్న సమంత, చాలా రోజుల తరువాత ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. త్వరలో సిటాడెట్‌: హనీ బనీ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో కెరీర్‌ గురించి మాట్లాడారు.

ree

అదే సమయంలో కొన్ని పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. ఖుషి రిలీజ్ తరువాత కంప్లీట్‌గా మీడియాకు దూరమయ్యారు సమంత. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించినా.. డైరెక్ట్‌గా మీడియాతో మాత్రం మాట్లాడలేదు.

ree

తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో మళ్లీ మీడియాతో టచ్‌లోకి వచ్చారు. ఖుషి సినిమాతో పాటు సిటాడెల్‌ ఇండియన్‌ వర్షన్‌ షూటింగ్ పూర్తి చేశారు సమంత.

ree

భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. త్వరలో డిజిటల్ ఆడియన్స్‌ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో లీడ్ రోల్‌లో నటించిన సమంత ప్రమోషన్స్‌కు రెడీ అవుతున్నారు.

ree

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్‌ గత మూడేళ్లుగా తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.కొంత కాలం చాలా కష్టాలు పడ్డా అన్న సమంత, ఆ ఇబ్బందులే తనను మరింత బలంగా తయారు చేశాయన్నారు.

ree

అలాంటి రోజులు మళ్లీ తన జీవితంలో రాకూడదని కోరుకుంటున్నా అన్నారు. అనారోగ్య కారణాలతో షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ, ఇటీవల మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమాను ఎనౌన్స్‌ చేశారు.

ree

త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అదే సమయంలో బాలీవుడ్‌లోనూ కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి.

ree

 
 
bottom of page