కలను చిదిమేసిన రెండు నిమిషాల కండీషన్…
- MediaFx

- Aug 13, 2024
- 1 min read
ఓ యువతి. ఎగ్జామ్ సెంటర్‌కు రెండు నిమిషాలు ఆలస్యంగా రావడంతో యువతిని పరీక్షను రాయడానికి అధికారులు అనుమతించలేదు. దీంతో గేటు వెలుపలే ఆ విద్యార్థి ఏడుస్తూ, కేకలు పెట్టింది. దీంతో ఇదంతా అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఆ విద్యార్థిని పీజీ పరీక్షకు హాజరయ్యే సమయంలో ఆ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చివరి క్షణంలో పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోవడంతో ఆ యువతి పడుతోన్న బాధను చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయ్యో పాపం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మరి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం అవసరమా.? అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాస్త నిబంధనలను సడలిస్తే ఏమవుతుంది అంటూ వాదిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ప్రిపరేషన్ సమయంలో అంతలా ఏకాగ్రతతో ఉన్న వారు పరీక్ష రాసే సమయానికి మాత్రం ఆలస్యంగా ఎందుకు రావాలి, పరీక్ష రోజు కాస్త ముందుగా వస్తే బాగుండేది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.












































