top of page

84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలు రాసి చరిత్ర సృష్టించిన ప్రపంచ ప్రఖ్యాత 🌟


ree

చదువుకోవాలన్న తపన ఉండాలే కానీ అది వయసుకు ఏమాత్రం అడ్డుకాదని నిరూపించాడో వృద్ధుడు. 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలు రాసి రికార్డులకెక్కాడు. మధ్యప్రదేశ్‌లోని చింద్‌వాడాకు చెందిన ప్రకాశ్ ఇండియన్ టాటా ఆయుర్వేద వైద్యుడు. విద్యాజ్ఞానం అస్సలు లేకపోవడంతో తొలుత మధ్యప్రదేశ్ ఓపెన్ బోర్డు నుంచి ఐదో తరగతి పరీక్షలు రాశారు. ప్రస్తుతం 8వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.ప్రకాశ్ సాధారణ ఆయుర్వేద వైద్యుడేమీ కాదు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, శిల్పా శెట్టి సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, విదేశీ వ్యాపారవేత్తలకు ఆయన సేవలు అందించారు. శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యకు కూడా ఆయన వైద్యం చేశారు. మొత్తం 112 దేశాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు కూడా ఆయుర్వేద వైద్యం అందించారు. ప్రస్తుతం 8వ తరగతి పరీక్షలు రాస్తున్న ఆయనను చూసిన విద్యార్థులు నోరెళ్లబెడుతున్నారు.

 
 
bottom of page