top of page

పుంగనూరు ఘటనలో 62 మంది అరెస్టు..👮‍♂️🚨

పుంగనూరు, ఆగస్టు 7: చిత్తూరు పుంగనూరు సమీపంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సమయంలో దాడులు జరిగిన సంగతి తెలిసిందే. భీమగానిపల్లెలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆదివారం 62 మందిని అరెస్టు చేశామని తెలిపారు.

పుంగనూరు, ఆగస్టు 7: చిత్తూరు పుంగనూరు సమీపంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సమయంలో దాడులు జరిగిన సంగతి తెలిసిందే. భీమగానిపల్లెలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆదివారం 62 మందిని అరెస్టు చేశామని తెలిపారు. స్థానిక ఎస్‌ఈబీ ఏఎస్పీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన్ను బైపాస్‌ మార్గంలో కాకుండా ఎలా అయినా పట్టణంలోకి తీసుకురావాలని వ్యూహం రచించారు పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా బాబు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు, వారిని అడ్డుకున్న పోలీసులతో వాదనకు దిగారు. పోలీసులకు చెందిన వజ్ర, ఈచర్‌ వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు వాటికి నిప్పు పెట్టారు. ఈ సంఘటనపై పుంగనూరు పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదు చేశాం. చల్లా బాబు అనుచరుడు గోవర్ధన్‌రెడ్డి, మరో 61 మందిని ఆదివారం అరెస్టు చేశామ’ని ఆమె తెలిపారు.💬🚓🚨


 
 
bottom of page