తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు
- Suresh D
- Jul 6, 2023
- 1 min read

తెలంగాణ: రాష్ట్రంలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న ప్రకటించారు.











































