2023 కుంభంలో సూర్యుడు, శని గ్రహాల కలయికతో ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే.!
- Venkatesh Thanniru
- Feb 11, 2023
- 1 min read

2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యుడు, శని గ్రహాలను వ్యతిరేక గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీన సోమవారం రోజున ఉదయం 9:57 గంటలకు మకరరాశిని వదిలి కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు. అయితే ఇదే రాశిలో శని దేవుడు ఇప్పటికే నివాసం ఉంటున్నాడు. దీంతో సూర్య, శని గ్రహాల కలయిక జరగనుంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన సంఘటన జరగనుంది. ఈ సమయంలో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా సూర్య శని గ్రహాల సంయోగం వల్ల ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యుడు కుంభరాశిలోకి సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అంతేకాదు వారితో పనికి సంబంధించిన ప్రయోజనాలను పొందొచ్చు. ఈ కాలంలో మీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా మెరుగ్గా నిర్వహించగలుగుతారు. మీ తెలివితేటలను పూర్తిగా వినియోగించుకుంటారు.
ఈ రాశి వారికి సూర్యుని రవాణా వల్ల కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ ఇంట్లో ఏదైనా వేడుకలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమయంలో అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు కొత్త ఇల్లు కొనాలనుకుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలు రానున్నాయి. మీరు డబ్బును చాలా తెలివిగా ఉపయోగిస్తారు.