top of page

బీచ్‌లో అలా విహరిస్తూ పిక్స్ వైరల్..

ప్రియా ప్రకాష్‌ వారియర్ తాజాగా మాల్దీవుల్లో మంటలు పుట్టించేస్తోంది. ప్రియా వారియర్ బికినీలో కనిపించి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఆమె అలా బీచుల వెంట నడుస్తూ ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది.

Priya Prakash Varrier Bikini : సినిమా విడుదలకు ముందు ఆకాశన్నంటే క్రేజ్‌లో ప్రియా వారియర్ ఉంది. సినిమా రిలీజ్ అయిన తరువాత ఆమె పాతాళంలోకి పడిపోయింది. అప్పటి వరకు క్యూ కట్టిన మేకర్లంతా కూడా ఆమెకు వెన్ను చూపారు.ఆఫర్లన్ని ఎగిరిపోయాయి. వచ్చిన క్రేజ్ అంతా గాల్లో బుడగలా తయారైంది. ఇక దీంతో కొన్ని రోజులు ప్రియా వారియర్ బయటి ప్రపంచానికి కనిపించకుండా పోయింది.ఆ తరువాత ఆమెకు నితిన్‌ పక్కన నటించే అవకాశం వచ్చింది. చెక్ సినిమాలో నితిన్‌కు జోడిగా నటించింది. రకుల్ ప్రీత్, ప్రియా వారియర్, నితిన్ కలిసి నటించిన చెక్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. దీంతో మళ్లీ ప్రియా వారియర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బాలీవుడ్‌లో చేసిన సినిమాలు సైతం బెడిసి కొట్టాయి. దీంతో ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క ప్రాజెక్ట్ లేకుండా పోయింది.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page