వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్..!
- Anwar MD
- Apr 25, 2023
- 1 min read

WhatsApp |
తాజాగా వాట్సాప్(Whatsapp) స్టేటస్ షేరింగ్‌పై అదిరిపోయే ఫీచర్లను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. మెస్సేజ్, ఫొటోలు, వీడియోల షేరింగ్‌లో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తున్నది. స్టేటస్‌లో ఉండే షేరింగ్ ఆప్షన్‌ను మరింత సులభతరం చేస్తోంది. మెటా యాజమాన్య పరిధిలో ఉన్న ఇతర ప్లాట్‌ఫామ్‌లతో స్టేటస్‌లను షేర్ చేసుకునేందుకు ఉపయోగపడనున్నది.
ఇప్పటిదాకా యూజర్లు ఆటో షేర్ ఆన్ ఫేస్‌బుక్ ఎంపికను ఆన్ చేస్తే వాట్సాప్ స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్ స్టోరీలకు షేర్ చేసుకోవచ్చు. ఎవరైతే యాప్ సెట్టింగ్స్‌ను మారుస్తారో వారు ఎప్పుడైనా ఈ ఆప్షన్‌ను స్టార్ట్ చేయొచ్చు.. లేదంటే ఆఫ్ చేసుకునే అవకాశం ఉంది.
షేర్ స్టేటస్ అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ట్రయల్స్ దశలో ఉండగా.. త్వరలోనే అందుబాటులోకి రానున్నది.