top of page

🌟 మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నాం’.. శుభవార్త చెప్పిన స్టార్‌ హీరో.. 🌟

🎬 ప్రముఖ కన్నడ నటుడు ధ్రువ సర్జా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాక్షన్‌ కింగ్ అర్జున్‌కు స్వయానా మేనల్లుడైన అతను డబ్బింగ్‌ సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా పలకరించాడు. ముఖ్యంగా 2021లో రిలీజైన ‘పొగరు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు.

అతను ఇప్పటివరకు కేవలం అరడజను సినిమాలే చేశాడు. అయితేనేం తనదైన నటనతో కన్నడ నాట స్టార్‌ హీరోగా వెలుగొందుతున్నాడు. ముఖ్యంగా ధ్రువ్‌ సర్జాకు భారీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

📽️ చూడడానికి చాలా బొద్దుగా కనిపించే ఈ యాక్షన్‌ హీరో ఈ మధ్యన చాలా స్లిమ్‌గా తయారయ్యాడు. త్వరలోనే ఏకంగా రెండు పాన్‌ ఇండియా సినిమాలతో మన మందుకు రానున్నాడు ధ్రువ్‌ సర్జా. సినిమాల సంగతి పక్కన పెడితే.. 🎉 తాజాగా ఒక శుభవార్త చెప్పాడీ శాండల్‌ వుడ్‌ సూపర్‌ స్టార్‌. త్వరలోనే అతను రెండోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్నాడు. సెప్టెంబర్‌లో సర్జా ఫ్యామిలీలోకి మరో కొత్త మెంబర్‌ రానున్నాడు. అతని భార్య ప్రేరణ త్వరలోనే ఓ పండంటి బాబుకు జన్మనివ్వనుంది. 📢 ఈ శుభవార్తను ధ్రువ్‌ సర్జా దంపతులే సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ధ్రువ్‌ సర్జా దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page