top of page

మైల్‌స్టోన్ మ్యాచ్‌లో తప్పని అవమానం🏏

ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లి ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్ లు ఆడాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ఏదో ఒక రికార్డు సొంతం చేసుకున్నాడు.

నిజానికి నాలుగో మ్యాచ్ ప్రారంభానికి ముందే చిన్నస్వామి స్టేడియంలో ఒకే మైదానంలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. కానీ అలాంటి మైల్ స్టోన్ మ్యాచ్ లో కోహ్లికి ఘోర అవమానం తప్పలేదు.లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో ఆర్సీబీ ఓడిపోవడంతో కోహ్లి ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్ లు ఓడిన ప్లేయర్ రికార్డు. ఇప్పటి వరకూ ఐపీఎల్లో కోహ్లి 120 మ్యాచ్ లు ఓడిపోయాడు. ఈ సీజన్లో తన కళ్లు చెదిరే బ్యాటింగ్ తో ఎన్నో రికార్డులతోపాటు ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్న కోహ్లి.. ఇప్పుడిలాంటి రికార్డును మూటగట్టుకోవడం ఊహించనిదే.🏏

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page