top of page

‘తంగలాన్’ షూటింగ్‌లో ప్రమాదం విక్రమ్‌కు విరిగిన పక్కటెముక.!

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ సెట్స్‌లో విక్రమ్ మంగళవారమే జాయిన్ కాగా.. యాక్షన్ సీన్ రిహార్సల్‌లో గాయపడినట్లు సమాచారం.

సౌత్ ఇండియన్ స్టార్ హీరో విక్రమ్ (Vikram) ప్రస్తుతం పా రంజిత్ (Pa Ranjith) దర్శకత్వంలో ‘తంగలాన్’ (Thangalaan) సినిమాలో నటిస్తున్నారు. పార్వతి, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్‌గా కనిపించనున్నారు. అయితే ఈ మూవీ సెట్స్‌లో విక్రమ్‌ ప్రమాదానికి గురయ్యారు. ఒక యాక్షన్ సీన్ కోసం రిహార్సల్ చేస్తున్న సమయంలో ఆయన గాయపడ్డారు. పక్కటెముక విరగడంతో (Rib Broken) ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో కొన్ని రోజుల పాటు ‘తంగలాన్’ షూటింగ్‌లో ఆయన పాల్గొనలేరని విక్రమ్ ఆఫీస్ నుంచి అఫిషియల్ న్యూస్ బయటికొచ్చింది.ఇక నిన్న మొన్నటి వరకు ‘పొన్నియిన్ సెల్వన్2’ ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొన్నారు విక్రమ్. లెజెండరీ డైరెక్టర్ విక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తను కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన PS2 సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారమే తన అప్‌కమింగ్ మూవీ ‘తంగలాన్’ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు విక్రమ్. అయితే, యాక్షన్ సీన్స్ కోసం రిహార్సల్ చేస్తున్న క్రమంలో ఆయన గాయపడటంతో మూవీ టీమ్‌తో పాటు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


 
 
bottom of page