top of page

‘ఫ్యామిలీ స్టార్’ రివ్యూ..🎥✨

యువతలో సూపర్ క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటి యువతలో ఉన్న ఆలోచనలకు తగ్గట్లుగా ప్రతి చిత్రంలో విజయ్ పెర్ఫామెన్స్ ఉంటోంది. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్, మేనరిజమ్స్ యువతకి బాగా నచ్చేశాయి. అందుకే తక్కువ సమయంలోనే విజయ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. నేడు ఏప్రిల్ 5న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అయింది . మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.   

ఫ్యామిలీ స్టార్ చిత్రం ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ అన్నట్లుగా సాగుతోంది కొన్ని వినోదాత్మక సన్నివేశాలు ఓకె. ఇక మిగిలిన భాగం ఏమాత్రం ఆకట్టుకోలేదు. టివి సీరియల్ ఫీలింగ్ ఫస్ట్ హాఫ్ లో గుర్తుంచుకునేలా ఒక్క సీన్ కూడా లేదు . సెకండ్ హాఫ్ కూడా ఫన్ సీన్స్ తో మొదలవుతుంది. కానీ వెంటనే ఏమాత్రం ఆసక్తికరంగా లేని సన్నివేశాలు రిపీట్ అయ్యాయి. మ్యూజిక్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. గీతా గోవిందం కాంబినేషన్ ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది . విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ ఒకే. కానీ దర్శకుడు పరశురామ్ అసలేం చెప్పదలుచుకున్నాడో పూర్తిగా కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ చిత్రానికి కమర్షియల్, మాస్ మూవీ అనే మైండ్ సెట్ తో వెళ్లొద్దు. ఫ్యామిలీస్ తో వెళ్ళండి ఎంజాయ్ చేస్తారు.  బొమ్మ పక్కాగా బ్రేక్ ఈవెన్ అవుతుంది . విజయ్ దేవరకొండ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావలసిన టైం ఇది. అతడి మ్యానరిజమ్స్ రిపిటీటివ్ గా అనిపిస్తున్నాయి. విజయ్ ఇకనైనా మంచి స్క్రిప్ట్స్ ఎంచుకోవాలి.  🎥✨

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page