top of page

🌟 అల్లు అర్జున్‏కు స్పెషల్ విషెస్ చెప్పిన రామ్ చరణ్..

69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రపరిశ్రమ సత్తా చాటింది. 2021 ఏడాదిగానూ 📅 గురువారం సాయంత్రం ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‏లో తెలుగు సినిమాలకు అవార్డ్స్ దక్కాయి.

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఏకంగా ఆర్ఆర్ఆర్ 🏆 అవార్డ్స్ రాగా.. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రానికి రెండు అవార్డ్స్ వచ్చాయి. ఇక తొలి సినిమాతోనే నేషనల్ అవార్డ్ అందుకున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు సన. ఆయన రూపొందించిన ఉప్పెన సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకు ఏ తెలుగు నటుడు అందుకోని బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నారు బన్నీ. ఇక ఈసారి నేషనల్ అవార్డులలో ఎక్కువగా మెగా హీరోలు నటించిన సినిమాలకే ఈ అవార్డ్స్ రావడం విశేషం. బన్నీకి జాతీయ ఉత్తమ నటుడిగా రావడంతో మెగా ఫ్యామిలీ ఫుల్ సంతోషంలో ఉంది. వెంటనే చిరు సోషల్ మీడియా వేదికగా బన్నీకి స్పెషల్ విషెస్ తెలుపగా.. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ బన్నీ ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపారు.

అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్త ఆలస్యంగా స్పందించారు. శుక్రవారం తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ తోపాటు.. పుష్ప, కొండపొలం, ఉప్పెన, అలియా భట్ లకు అభినందనలు తెలిపారు. 🎉👏

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page