📽️ పాయల్ కొత్త సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్
- Shiva YT
- Sep 25, 2023
- 1 min read
🎉 ఆర్‌ఎక్స్ 100 ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుందీ మూవీ. 📽️ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను రాబట్టిందీ సినిమా. 🎬

అజయ్ భూపతి దర్శకుడిగా తెరకెక్కించిన తొలి సినిమాతోనే ఊహించని విజయాన్ని అందుకున్నాడు. 🌟 ఇక ఇదే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసిందీ బ్యూటీ. 👸 ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో మరో చిత్రం వస్తోంది. 📽️
🎥 నిజంగా చెప్పాలంటే ఆర్‌ఎక్స్ 100 తర్వాత అటు దర్శకుడు అజయ్ భూపతికి కానీ, ఇటు పాయల్ రాజ్‌పుత్‌కు కానీ మళ్లీ ఆ స్థాయి విజయం దక్కలేదని చెప్పాలి. 📢 ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ లేటెస్ట్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 🌟 మంగళవారం పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహాసముద్రం వంటి భారీ డిజాస్టర్ తర్వాత అజయ్ భూపతి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 🎬 ప్రస్తుతం తన ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మంగళవారం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 📸🎥