top of page

బిగ్ అప్డేట్ కి రెడీ అయిన “థగ్ లైఫ్”


యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ థగ్ లైఫ్. స్టార్ హీరోయిన్ త్రిష ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. మే 8, 2024 న మరొక కీలక పాత్రను ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. అయితే ఈ కీలక పాత్ర శింబు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్లారిటీ రావాలంటే 8 వ తేది వరకు ఎదురు చూడాల్సిందే. థగ్ లైఫ్‌లో జయం రవి, దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్ కార్తీక్, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్‌ లు నిర్మిస్తున్న ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page