top of page

'ఇండియాకు వెళ్లిపోండి'..కెనడాలోని ఇండియన్స్‌కు ఖలిస్తాన్ ఉగ్రవాదుల బెదిరింపు.. 🇮🇳🇨🇦

కెనడాలో రోజురోజుకు భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఖలిస్తాన్‌ తీవ్రవాదులకు కెనడా అడ్డాగా మారడం భారత్‌లో ఆందోళన మరింత పెరుగుతోంది.

కెనడాలో ఉన్న హిందువులు వెంటనే భారత్‌కు వెళ్లిపోవాలని, లేదంటే తీవ్ర పరిణమాలు ఉంటాయని ఖలిస్తాన్‌ సంస్థలు హెచ్చరించాయి. దీంతో భారత ప్రభుత్వం అలర్ట్‌ జారీ చేసింది. 🚨

నిషేధిత ఖలిస్తాన్ అనుకూల సంస్థ సిక్కుస్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ కెనడాలోని భారతీయ సంతతికి చెందిన హిందువులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. భారతదేశానికి మద్దతు ఇచ్చినందుకు, ఖలిస్తానీ నాయకుడు హర్‌దీప్ హత్యను సెలబ్రేట్ చేసుకున్నందుకు దేశం విడిచి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియన్ హిందువులు కెనడా వదిలి భారతదేశానికి వెళ్లిపోవాలని ఈ వీడియోలో సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. 🚫🔴

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page