🗣️ లోక్‌సభలో రాహుల్ ప్రసంగం వెనుక స్క్రిప్ట్ ప్లే చేసింది ఎవరో తెలుసా..
- Shiva YT
- Aug 10, 2023
- 1 min read
🗣️లోక్‌సభలో బుధవారం (ఆగస్టు 9) మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

రాహుల్ ప్రసంగంలోని దూకుడు సర్వత్రా వినిపించింది. సభ లోపలా, బయటా అన్ని చోట్లా చర్చనీయాంశం అవుతోంది. అయితే ఈ ప్రసంగానికి మూలాధారం ఇవ్వడంలో ఎవరైనా ప్రత్యేక పాత్ర పోషించారంటే అది ఆయన తల్లి, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీయే అని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇండియా టుడేలో వచ్చిన ఒక కథనం ప్రకారం, రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రసంగిస్తున్నప్పుడు.. సోనియా గాంధీ ఎప్పటికప్పుడు ఆయనకు మార్గనిర్దేశం చేస్తూ కనిపించారు.
💬 తద్వారా ఆయన మాటలు సరైన స్థలంలో ప్రభుత్వాన్ని తాకాయి. రాహుల్ ముందు వరసలో కూర్చున్నా సోనియాగాంధీ ఆయనకు సలహాలు ఇస్తూనే ఉన్నారు. అందుకే రాహుల్ కూడా తల్లి సలహాను అంగీకరించడంలో ఆలస్యం చేయలేదు. తన ప్రసంగం మొదలు పెట్టిన సమయం నుంచి మొదలు.. మధ్య మధ్యలో ఎలా మాట్లాడాలి.. ఏ సమయంలో ఎలా దాడి చేయాలో చెప్పడం కనిపించింది.