top of page

🔴 తండ్రిని హత్య చేసిన కూతురు ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.! 😨😢

🏠 ఇంటికి ఆలస్యంగా వస్తున్నందుకు తిట్టిన తండ్రినే కడతేర్చింది ఓ యువతి. శనివారం అర్థరాత్రి హైదరాబాద్‌ అంబర్‌పేట‌‌లో జరిగిన ఈ ఘటనలో జగదీష్(45) అనే కూలీ చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు జగదీష్ కూతురు నిఖితను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగం చేసి ఇంటికి ఆలస్యంగా వచ్చిన నిఖితను అప్పటికే తాగి ఉన్న తన తండ్రి జగదీష్ లేటు ఎందుకు అయ్యిందంటూ తిట్టాడు. ఇద్దరి మధ్య ముదిరిన వాగ్వాదం నేపథ్యంలో నిఖిత పక్కనే ఉన్న బాటిల్‌ని తీసుకుని తండ్రి మెడలో పొడిచింది. అది తెలుసుకున్న స్థానికులు వెంటనే జగదీష్‌ను ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 🚑

🚨 అయితే జగదీష్ మెడకు తీవ్ర గాయం కావడంతో అతను చికిత్స పొందుతూనే మరణించాడు. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా, విచారణలో నిఖిత.. ఆలస్యంగా వచ్చినందుకు తన తండ్రి తిట్టాడని, తాను చెప్పే కారణం వినడానికి అతను ఇష్టపడకుండా అరిచాడని అందుకే బాటిల్‌లో దాడి చేసినట్లు చెప్పుకొచ్చిందని పోలీసులు తెలిపారు. 🚓

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page