UK లో మరణించిన తెలుగు అమ్మాయి
- mahesh
- Apr 19, 2023
- 1 min read
హైదరాబాద్: higher studies కోసం విదేశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని అనుకోని ప్రమాదంలో కోల్పోయిన సాయి తేజస్విని . ఇంగ్లాండ్‌లోని సముద్ర తీరంలో సరదాగా ఈతకొడుతుండగా.. పెద్ద అలలు రావడంతో కొట్టుకుపోయింది. కోస్ట్‌గార్డ్ సిబ్బంది రక్షించడానికి ప్రయత్నిచినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ఒడ్డుకు తీసుకొచ్చి సాయి తేజస్వినికి సీపీఆర్ చేసినా స్పందించలేదు. పరీక్షించిన వైద్యులు ఆమె మరణించినట్లు నిర్ధరించారు. విషయం తెలిసి తేజస్విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సాయితేజస్విని మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకుని రావడానికి సాయం చేయాలని ఆమె కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్‌ను కోరారు.అవసరమైన సహాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.
వాస్తవానికి బ్రైటన్ సముద్రంలో ఇటువంటి దారుణ సంఘటనలు అనేకం గతంలో జరిగాయి. లాంగ్ వీకెండ్ అవడంతో సాయి తేజస్విని విహారానికి వెళ్లినట్టు తెలుస్తోంది. సాయి తేజస్విని స్వస్థలం హైదరాబాద్ లోని సైదాబాద్. కాగా, యూకే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.